కరోనా వ్యాక్సిన్ చుట్టూ రాజకీయాలు..!!

వాస్తవం ప్రతినిధి: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ నుండి ఈ ప్రపంచం ఎప్పుడు బయటపడుతుందో అనే ఆందోళనలో భూమి మీద ఉన్న ప్రజలంతా ఉన్నారు. చాలామంది కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎంత డబ్బు పేరు పరపతి ఉన్నాగాని ప్రస్తుత రోజుల్లో…. వాటిని ఏమి పట్టించుకోవడం లేదు ఎవరు. వైరస్ వచ్చిన తర్వాత రాకముందు ప్రజల జీవితలలో చాలా మార్పులు రావటం జరిగాయి.

మరోవైపు త్వరలో బీహార్ రాష్ట్రంలో అదే విధంగా తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు కరోనా భయాన్ని ఓటు రూపంలో మలుచుకోవడానికి హామీలు కురిపిస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళ్తే ఇటీవల బీహార్ ఎన్నికల వేళ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి… తమకి గాని ఛాన్స్ ఇస్తే బీహార్ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తామని… బిజెపి తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇదే రీతిలో తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి కూడా ఈ విధంగానే అనగా అన్నాడీఎంకే పార్టీ ని తమిళ ప్రజలు అధికారంలోకి తీసుకొస్తే కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్ పూర్తిగా అందుబాటులో రాకముందే… ఇలా దేశంలో పలు పార్టీలన్నీ వ్యాక్సిన్ ని ఆధారం చేసుకుని రాజకీయాలు చేయటం గమనార్హం.