ఏపీ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ కొత్త డిమాండ్..!!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా చాలా పంట నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. అదేవిధంగా పెట్టుబడి మొత్తాన్ని పరిహారంగా తక్షణమే చెల్లించాలని పేర్కొన్నారు. గత ఏడాది కూడా రైతులకు ప్రభుత్వం పంట నష్టం ఇవ్వలేదని ఇప్పుడు కూడా ఇవ్వకపోతే రైతును బాధపెడితే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఇటీవల భారీ వర్షాల కారణంగా కృష్ణా, గుంటూరు అదేరీతిలో ఉభయ గోదావరి జిల్లాలలో భారీ ఎత్తున పంట నష్టం జరిగింది. ఈ జిల్లాలలో ఎక్కడైతే పంట నష్టం జరిగి పొలాలు నీటి ముంపుకు గురయ్యాయో అక్కడ జనసేన నాయకులు ఇటీవల పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 2.71 లక్షల ఎకరాలలో పంటలు పూర్తిగా దెబ్బ తినటం జరిగాయని, వాస్తవంగా ఇంకా ఎక్కువగా పంట నష్టం జరిగి ఉంటుందని జనసైనికులు అంచనా వేశారు. దీంతో రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఓ ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని… పంట నష్టం అంచనాలను రూపొందించే ప్రభుత్వం పరిహారాన్ని అందించడంలో వెనకడుగు వేస్తుందని… రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మండిపడ్డారు.