సుడిగాలి సుధీర్ కి కరోనా పాజిటివ్..!!

వాస్తవం సినిమా: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగా అలరించే షో జబర్దస్త్. ఈ టీవీ ఛానల్ లో ప్రసారం అయ్యే ఈ షో రికార్డు స్థాయిలో టిఆర్పి రేటింగులు సాధిస్తది. ఈ షో ద్వారా బాగా పాపులర్ అయిన వారిలో సుడిగాలి సుదీర్ కూడా ఒకడు. తన అదిరిపోయే టైమింగ్ తో కామెడీ పంచులు వేసే సుడిగాలి సుదీర్ కి ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ ఉంది. హీరోగా కూడా ప్రయత్నాలు చేయటం జరిగింది. ప్రస్తుతం టెలివిజన్ రంగంలో పలు షోలలో విజయవంతంగా రాణిస్తున్నాడు. ఇదిలాఉంటే ఇటీవల అక్టోబర్ 18 వ తారీఖున సుడిగాలి సుధీర్ కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సమాచారం. దీంతో సుధీర్ హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై సుధీర్ ఇంకా స్పందించలేదు. మరోవైపు సుధీర్‌కి కరోనా అని వార్తలు వస్తుండటంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో వార్త వైరల్ కావటంతో ఇటీవల సుడిగాలి సుదీర్ ఏఏ షో లలో పాల్గొనడం జరిగిందో ఆ షోలలో పాల్గొన్నవారు కూడా… కరోనా పరీక్షలు చేయించుకోవడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీ టాక్.