మరో ఆరు నెలల తర్వాత ప్రధాని పదవికి బోరిస్‌ రాజీనామా .. ఎందుకంటే..??

వాస్తవం ప్రతినిధి : మరో ఆరు నెలల తర్వాత ప్రధాని పదవికి బ్రిటన్‌ ప్రధాని రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం. ఎందుకంటే.. తనకిచ్చే జీతం తక్కువగా ఉంటున్నందున బ్రిటన్‌ ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నాడంట బోరిస్‌ జాన్సన్‌.

బ్రిటన్‌ దినపత్రిక ‘ది డైలీ మిర్రర్’ ప్రకారం.. బోరిస్‌ జాన్సన్ సుమారు 1,95,000 డాలర్లు (1,50,400 పౌండ్లు) సంపాదిస్తాడు. బ్రెక్సిట్ పూర్తయిన వెంటనే కార్యాలయాన్ని విడిచిపెట్టి రాజీనామా చేయాలని, కరోనా వైరస్ మహమ్మారి అంతమైన తర్వాత దేశాన్ని చుట్టిరావాలని యోచిస్తున్నాడట. తన మునుపటి వృత్తితో పోల్చితే కూడా తన జీతం తక్కువగా ఉన్నదని ప్రధానమంత్రి అనుకుంటున్నట్లు కొంతమంది పేరులేని టోరీ పార్టీ ఎంపీలు భావిస్తున్నారు. టోరీ పార్టీ నాయకుడిగా మారడానికి ముందు.. బోరిస్‌ జాన్సన్‌ రోజువారీ టెలిగ్రాఫ్ కాలమిస్ట్‌గా సంవత్సరానికి 3,55,584 డాలర్ల జీతంలో ఉన్నారు. రెండు ప్రసంగాలు ఇవ్వడం ద్వారా నెలలో 2,06,885 డాలర్లు సంపాదించారు.