ఆ కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వలంటీర్‌ మృతి..!!

వాస్తవం ప్రతినిధి : కోవిడ్‌ చికిత్స కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొన్న ఓ వ్యక్తి అనారోగ్యానికి గురవ్వడంతో ట్రయల్స్‌‌ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా బ్రెజిల్‌లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ పరీక్షల్లో పాల్గొన్న ఓ వలంటీర్‌ మరణించాడు. అయితే, ఈ ట్రయల్ సేఫ్టీ కి సంబంధించి ఎలాంటి ఆందోళన అనవసరమని , మెనింజైటిస్ వ్యాక్సీన్ తీసుకున్న కంట్రోల్ గ్రూప్ లో ఈ వాలంటీర్ ఒకడని, దీనితో బాటు కోవిడ్ టీకామందు కూడా తీసుకున్నాడని ఈ సంస్థ వెల్లడించింది. 28 ఏళ్ళ ఇతడు రియో డీ జెనీరోవాసి అని తెలుస్తోంది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ని కో-ఆర్డినేట్ చేస్తున్న ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ సావో పాలో-ఈ వ్యక్తి ఎక్కడ, ఏ పరిస్థితుల్లో నివసిస్తున్నాడో తెలియదని పేర్కొంది. కాగా ఆస్ట్రా జెనికా కంపెనీ మాత్రం ఈ వాలంటీర్ మృతిపై స్పందించలేదు.