నా స్నేహితుడు రాజ‌శేఖర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆశిస్తున్నాను: చిరంజీవి

వాస్తవం ప్రతినిధి: టాలీవుడ్ యాంగ్రీ హీరో రాజశేఖర్ కరోనాతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.. తాజాగా అయనకి సంబంధించిన హెల్త్ బులిటెన్ విడుదలైంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అయన, ట్రీట్‌మెంట్‌కు స్పందిస్తున్నారని వైద్యులు వెల్లడించారు. రాజశేఖర్‌ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని, వెంటిలేటర్ సపోర్టు లేకుండానే చికిత్సకు స్పందిస్తున్నారని ఆసుపత్రి మెడికల్‌ డైరెక్టర్ రత్నకిశోర్‌ తెలిపారు. రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటుగా, టాలీవుడ్ నటులు దేవుణ్ణి ప్రార్దిస్తున్నారు.

అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. డియ‌ర్ శివాత్మిక .. మీ నాన్న‌, నా స్నేహితుడు రాజ‌శేఖర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆశిస్తున్నా. ధైర్యంగా ఉండండి. అంద‌రి ప్రార్ధ‌న‌ల‌తో రాజ‌శేఖ‌ర్ త్వ‌ర‌గా కోలుకుంటారు. మీ కుటుంబం కోసం ప్రార్ధిస్తున్నాను అని చిరంజీవి ట్వీట్ చేశారు. దీనికి ముందు రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి చాలా క్రిటిక‌ల్‌గా ఉందని సోషల్ మీడియాలలో న్యూస్ స్ప్రెడ్ అవ్వడంతో దీనిపైన శివాత్మిక స్పందించారు.