కొమరంభీంగా గర్జించిన యంగ్ టైగర్..’ఆర్.ఆర్.ఆర్’స్పెషల్ టీజర్ రిలీజ్!

వాస్తవం సినిమా:  ‘ఆర్.ఆర్.ఆర్’ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ విప్లవవీరుడు ‘కొమరం భీమ్’ గా ఇండియన్ బాక్సాఫీస్ కు తన సత్తా చూపించబోతున్నాడనే దానికి సాక్ష్యంగా తాజాగా స్పెషల్ టీజర్ ని విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. గోండు వీరుడు కొమరం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు.

ఈరోజు కొమరం భీం జయంతిని పురస్కరించుకుని రామ్ చరణ్ వాయిస్‌తో భీంకు సంబంధించిన వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. అందులో ఎన్టీఆర్.. కొమరం భీం పాత్రలో గర్జిస్తున్నాడు. దీనికి చరణ్ అందించిన వాయిస్ ఓవర్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. విప్లవవీరుడు ‘కొమరం భీమ్’ గా ఎన్టీఆర్ అద్భుతమైన నటన కనబరిచాడని ఈ ఇంట్రో వీడియోతోనే తెలిసిపోతోంది. ఈ వీడియోలో ఎన్టీఆర్ ని చూస్తే ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ అభిమాని కూడా ఔరా అనక మానడు.
ఈ సినిమాలో ఒలీవియా మోరిస్, అలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ సరన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా 2021లో విడుదల కానుంది. దాదాపు 400 కోట్ల రూపాయలతో రూపొందుతోన్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు.