రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమం!

వాస్తవం సినిమా: టాలీవుడ్ నటుడు రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని, అభిమానులందరూ ఆయన ఆరోగ్యం కోసం ప్రార్ధించాలంటూ రాజశేఖర్ కుమార్తె శివాత్మిక కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేసింది.

గతకొన్ని రోజులుగా ఆయన కరోనా వైరస్‌తో పోరాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని ఆయన కూతురు శివాత్మిక ట్వీట్ చేసింది. ‘కరోనా వైరస్‌తో నాన్న పోరాటం కాస్త కష్టంగా మారింది. ఆయన ధైర్యంగా పోరాడుతున్నారు. మీ ప్రార్థనలు, మద్దతు మమ్మల్ని కాపాడతాయని మేం బలంగా నమ్ముతున్నాం. నాన్న త్వరగా కోలుకోవాలని మీరందరూ దయచేసి ప్రార్థనలు చేయండి. మీ ప్రేమతో ఆయన క్షేమంగా తిరిగి వస్తారు.’ అని శివాత్మిక ట్వీట్‌లో పేర్కొంది.