మూడు రాజధానులు విషయంలో వైసిపికి అచ్చెన్నాయుడు సవాల్ ..!!

వాస్తవం ప్రతినిధి: మూడు రాజధానులు విషయంలో టిడిపి పార్టీకి కొత్త అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వైసీపీ కి సవాల్ విసిరారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లైవ్ లో మాట్లాడుతూ ఉన్న సమయంలోనే.. అచ్చెన్నాయుడు స్పందిస్తూ వైసీపీకి దమ్ముంటే ఉత్తరాంధ్ర మూడు జిల్లాల ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని… మూడు రాజధానుల నిర్ణయాన్ని రిఫరెండంగా తీసుకుని ప్రజలను తీర్పు కోరదామని అన్నారు. అంతేకాకుండా ‘అమరావతే మా రాజధాని అని గత ఎన్నికల్లో మేం పోటీ చేశామని ఆయన అన్నారు. ఉత్తరాంధ్రలో టీడీపీ నుంచి ఆరుగురం గెలిచాం. వైసీపీ కూడా ఆ ఎన్నికల్లో అమరావతే రాజధాని అని చెప్పింది. మాట మార్చినందుకు లెక్క ప్రకారం వారు మాత్రమే రాజీనామా చేసి ప్రజాతీర్పు కోరాలి. అయినా సరే మీరూ, మేమూ.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలందరం రాజీనామా చేసి మళ్లీ ప్రజల ముందుకు వెళ్దాం. వారు ఏం తీర్పు ఇస్తారో చూద్దాం.అని..ఇవాళ చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులతో నిర్వహించిన జూమ్ సమావేశంలో అచ్చెన్నాయుడు సవాలు చేసినట్లు ఏపీ రాజకీయాలలో వార్తలు వైరల్ అవుతున్నాయి.