జగన్ ఫెయిల్యూర్ సీఎం అంటున్న చంద్రబాబు..!!

వాస్తవం ప్రతినిధి: రాష్ట్రంలో కుండపోత వర్షాల కారణంగా రైతాంగం చాలా నష్టపోయిన సంగతి తెలిసిందే. పంట పొలాలు అన్నీ నీట మునగడంతో… రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ఇటువంటి తరుణంలో సీఎం జగన్ పై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో జగన్ అంతటి విఫలమైన ముఖ్యమంత్రి మరొకరు లేరని పేర్కొన్నారు. ఇటీవల పార్టీ నేతలతో చంద్రబాబు వీడియో సమావేశంలో మాట్లాడుతూ ఈ కామెంట్లు చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

రాష్ట్రంలో వరద విపత్తు బాధితులకు ఎలా ఆదుకోవాలి అనే విషయంలో తెలుగుదేశం పార్టీ చేసి చూపించిందని, హుద్ హుద్, తితిలి తుఫాన్ పంటి ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొని బాధితులకు అండగా నిలబడిన ప్రభుత్వం టిడిపి అని చంద్రబాబు పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పేర్కొన్నారట. జగన్ కేవలం గాల్లో ప్రదక్షణ చేసి చేతులు దులుపుకున్నారు… ఏపీలో వరద బాధితులను నష్టపోయిన రైతులను ఆదుకోవటానికి మంత్రులు కూడా రావడం లేదని… ఆరోపించారు. మొత్తం మీద వరద బాధితులను ఆదుకున్న విషయంలో జగన్ ఫెయిల్యూర్ సీఎం అని చంద్రబాబు అభివర్ణించినట్లు వార్తలు వస్తున్నాయి.