జగన్ పై ఫిర్యాదు చేస్తూ మోడీ కి లెటర్ రాసిన ఎంపీ రఘురామకృష్ణంరాజు..!!

వాస్తవం ప్రతినిధి: ఏపీ సీఎం వైఎస్ జగన్ పై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రధాని మోడీకి లెటర్ రాసినట్లు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. బీసీ లలో కులానికో సొసైటీ పెట్టి ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపించారు. విభజించి పాలించే చర్యలను వైసీపీ ప్రభుత్వం మానుకుంటే మంచిదని సూచించారు.

అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన పెరిగిపోయిందని మండిపడ్డారు. అందువల్లే రాజ్యాంగ హక్కులను కాపాడే విధంగా రాజ్యాంగ ఉల్లంఘన పై ప్రధాని మోడీ కి లెటర్ రాశాను అని తెలిపారు.

అంతే కాకుండా తెలుగు భాష విషయంపై కూడా మరోసారి రఘురామకృష్ణంరాజు స్పందించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బ్యాలెట్ లో తెలుగు భాషకు ప్రాధాన్యత ఇచ్చారని, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుభాషను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంగ్ల ప్రదేశ్ గా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.