ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు దుర్మరణం

వాస్తవం ప్రతినిధి: మహారాష్ట్రలో బస్సుబోల్తా పడిన ఘటనలో ఐదుగురు మరణించారు. బుధవారం ఉదయం విసర్వాడీ సమీపంలోని కొండైబారి ఘాట్‌ సమీపంలోని లోయలో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, 31 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. మల్కాపూర్‌ నుండి సూరత్‌ వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిందని, ఈ ఘటనలో బస్స డ్రైవర్‌, క్లీనర్‌తో పాటు మరో ముగ్గురు మరణించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది వరకు ఉన్నారు. ఈ ఘటనలో డ్రైవర్‌, క్లీనర్‌‌తో సహా ఐదుగురు మృతి చెందారు. ఇదే హైవేపై 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో కొన్ని గంటల వ్యవధిలో జరిగిన మూడు వేర్వేరు ప్రమాదాలు జరిగినట్టు పోలీసులు తెలిపారు.