వానలో కమలా హ్యారిస్ డ్యాన్స్.. వీడియో వైరల్..!!

వాస్తవం ప్రతినిధి : డెమొక్రాటిక్ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ కమలా హ్యారిస్ వానలో డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్లోరిడాలో ఎలక్షన్ క్యాంపెయిన్​లో భాగంగా ఆమె వానలో డ్యాన్స్ చేశారు. ఆ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. దానికి “రెయిన్ ఆర్ షైన్, ప్రజాస్వామ్యం ఎవరి కోసం వెయిట్ చెయ్యదు” అని క్యాప్షన్ పెట్టారు. ప్రెసిడెంట్ ఎలక్షన్లలో ఫ్లోరిడా ఓటర్లు కీలకమని, వారే విన్నర్​ను డిసైడ్ చేస్తారని హ్యారిస్ అన్నారు.