ట్రంప్‌, బైడెన్ మ‌ధ్య చివ‌రి చ‌ర్చ.. డిబేట్ కోసం కొత్త రూల్ ..!

వాస్తవం ప్రతినిధి : అమెరికాలో నవంబర్ 3 న జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు కేవలం 13 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలోనే డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీల అభ్యర్ధులు ఇరువురు హోరా హోరీగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే, అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో భాగంగా.. ట్రంప్‌, బైడెన్ మ‌ధ్య గురువారం రెండో, చివ‌రి చ‌ర్చ జ‌ర‌గ‌నున్న‌ది. అయితే ఆ డిబేట్ కోసం కొత్త రూల్ తెచ్చారు. త‌మ‌కు కేటాయించిన స‌మ‌యం క‌న్నా ఎక్కువ మాట్లాడినా, లేక అవాంత‌రం సృష్టించినా, అప్పుడు మైక్ ఆపేసేందుకు నిర్ణ‌యించారు. క‌మిష‌న్ ఆన్ ప్రెసిడెన్షియ‌ల్ డిబేట్స్ ఈ ప్ర‌తిపాద‌నను ఆమోదించింది. టీవీల్లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం అయ్యే ఈ డిబేట్‌లో ఇద్ద‌రికీ ప్ర‌తి అంశంపై మాట్లాడేందుకు రెండు నిమిషాల స‌మ‌యం కేటాయించారు.