వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ డెడ్‌లైన్‌ ‌ను పెంచిన అమెజాన్ .. ఎప్పటివరకు అంటే..??

వాస్తవం ప్రతినిధి : కోవిడ్ మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో మైక్రోసాఫ్ట్‌, ట్విట్ట‌ర్ లాంటి టెకీ సంస్థ‌లు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌ను పొడిగించిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా అమెజాన్ సంస్థ త‌న ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ డెడ్‌లైన్‌ను పెంచింది. వ‌చ్చే ఏడాది జూన్ వ‌ర‌కు ఇంటి నుంచి ప‌ని చేయ‌వ‌చ్చు అని పేర్కొన్న‌ది. గ‌తంలో ఈ ఆఫర్‌ను జ‌న‌వ‌రి వ‌ర‌కు ఇచ్చిన అమెజాన్ సంస్థ‌.. ఇప్పుడు ఆ స‌మ‌యాన్ని జూన్ 30 వ‌ర‌కు పెంచింది. అయితే అమెరికాలో సుమారు 19 వేల మంది అమెజాన్ వ‌ర్క‌ర్లకు క‌రోనా వైర‌స్ సోకిన నేప‌థ్యంలో ఆ సంస్థ నిర్ణ‌యం తీసుకున్న‌ది.