ఆ గోల్డెన్ చాన్స్ మిస్ చేసుకున్న ట్రంప్ భార్య..!!

వాస్తవం ప్రతినిధి : కరోనావైరస్ సోకిన తరువాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ఎడతెగని దగ్గుతో బాధపడుతున్నారు. వైరస్ నుంచి మెలానియా ట్రంప్ ఆరోగ్యం రోజురోజుకూ చక్కబడుతోంది. కానీ దగ్గు మాత్రం తగ్గడంలేదు. దీంతో ముందుజాగ్రత్త చర్యగా ఆమె తన ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారని స్టెఫానీ తెలిపారు. దీంతో, మెలానియ భర్త, ట్రంప్ తో కలిసి ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సిన అరుదైన అవకాశాన్ని మెలానియా వదులుకున్నారని స్టెఫానీ గ్రిషామ్ ఒక ప్రకటనలో తెలిపారు. 2019 నుండి తన భార్యతో వేదికపై కనిపించలేదు. మెలానియా పెన్సిల్వేనియాకు వెళ్లి ఉంటే, దాదాపు సంవత్సరం తరువాత భర్తతో కలిసి అతి కీలకమైన ర్యాలీలో పాల్గొనే అవకాశం దక్కేది. కానీ అనారోగ్యం కారణంగా ఆ గోల్డెన్ చాన్స్ ను మెలానియా మిస్ అవుతున్నారని భావిస్తున్నారు.