బ్రిటన్ లో ఎన్నారై డాక్టర్ కు అరుదైన అవార్డ్..!

వాస్తవం ప్రతినిధి : బ్రిటన్ లో నివాసముంటున్న భారత సంతతికి చెందిన డాక్టర్ జాజిని వర్గీస్‌కు.. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్(జేసీఐ) స్వచ్ఛంద సంస్థ.. డాక్టర్ జాజిని వర్గీస్‌ను ఔట్ స్టాండింగ్ పర్సన్ ఆఫ్ ది వరల్డ్‌గా ఎంపిక చేసింది. రొమ్ము కాన్సన్‌ నిర్ధారణ, చికిత్సపై ఆమె చేసిన కృషికి గానూ ఈ గౌరవం దక్కింది. ఈ ఏడాది నవంబర్‌లో జపాన్‌లోని యోకోహామాలో జేసీఐ వరల్డ్ కాంగ్రెస్ సమావేశంలో డాక్టర్ జాజిని వర్సీస్ అవార్డును అందుకోనున్నారు. ఈ అవార్డుకు ఎంపిక కావడం పట్ల.. 39ఏళ్ల జాజిని వర్గీస్ సంతోషం వ్యక్తం చేశారు.