డిసెంబర్ నుండి పవన్ సినిమా స్టార్ట్..!!

వాస్తవం ప్రతినిధి: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు రెండు సంవత్సరాల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం తో… ప్రస్తుతం చేస్తున్న “వకీల్ సాబ్” సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. కొద్దిపాటి షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న ఈ సినిమా వాస్తవానికి కరోనా రాకపోయి ఉంటే… ఈ ఏడాది వేసవి కాలంలోనే మే 15వ తారీఖున రిలీజ్ అయి ఉండేది. కరోనా రావటంతో పరిస్థితులన్నీ మారిపోవడంతో … బ్యాలెన్స్ షూటింగ్ వాయిదా పడింది.

ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో పౌరాణిక నేపథ్యం కలిగిన సినిమా షూటింగ్ స్టార్ట్ చేయటానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. వాస్తవానికి క్రిష్ ఈ సినిమాకి ముందు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నీ హీరోగా లాంచ్ చేయాలని భావించారు, కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో, పవన్ సినిమా డిసెంబర్లో స్టార్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తాజాగా ఫిల్మ్ నగర్లో వార్తలు వస్తున్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో పవన్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.