అదరగొట్టిన బాలయ్య బాబు నర్తనశాల ఫస్ట్ లుక్ రిలీజ్..!!

వాస్తవం సినిమా: స్వీయ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ “నర్తనశాల” అనే సినిమా స్టార్ట్ చేసి ప్రారంభం లోనే ఆగిపోవటం జరిగింది. కాగా ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజ్ అయింది. సినిమాకి సంబంధించి 17 నిమిషాల పాటు నిడివి ఉన్న సన్నివేశాలు సినిమా ఏమిటి దసరా పండుగ నాడు విడుదల చేయటానికి రెడీ అయింది. అక్టోబర్ 24న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో అర్జునుడు పాత్రల్లో బాలకృష్ణ నటిస్తుండగా అలనాటి అందాల తార సౌందర్య ద్రౌపది పాత్రలో కనిపించనుంది.

అంతేకాకుండా ఈ సినిమాలో శ్రీహరి భీముడు పాత్రలో నటించాడు. అయితే చాలా కాలం తర్వాత శ్రీహరి మరియు సౌందర్య వంటి పాత నటులను చూసే అవకాశం రావడంతో ఈ సినిమా వార్త పై సోషల్ మీడియాలో సినీ ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పౌరాణిక పాత్రలో బాలకృష్ణ కనిపించబోతున్న తరుణంలో ఈ దసరాకి ఈ వీడియో చాలు అని నందమూరి అభిమానులు ఈ వార్తపై సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.