ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా మృతులు..!!

వాస్తవం ప్రతినిధి: కరోనా వైరస్ ప్రభావం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ అర్థం కావడం లేదు. మొన్నటి వరకు ఏపీలో పరిస్థితి అంతా సద్దుమణిగింది అని అనుకున్న సమయంలో ఒక్కసారిగా ఒకే రోజు 28 మంది మహమ్మారి కరోనా వల్ల చనిపోవడం ప్రభుత్వ వర్గాల్లో మళ్లీ టెన్షన్ పుట్టించి నట్లయింది. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటలలో 69,095 శాంపిల్స్‌ని పరీక్షించగా కేవలం 3,503 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి 28 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,89,553 కి చేరింది. అయితే ఇందులో 33,396 మంది చికిత్స పొందుతుండగా 7,49,676 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 5,144 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6,481 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 71,96,628 శాంపిల్స్ పరీక్షించారు. మొత్తంమీద చూసుకుంటే ఏపీలో కరోనా విలయతాండవం చేస్తుందన్న టాక్ ప్రస్తుతం బలంగా ప్రభుత్వ వర్గాల నుండి వినబడుతోంది.