తప్పు చేస్తే ఎవరైనా సరే..ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దు: జగన్

వాస్తవం ప్రతినిధి: విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నేటి నుంచి పోలీసుల సంస్మరణ దినోత్సవాలు జరగనున్నాయి. నేటి నుంచి అక్టోబర్ 31 వరకు సంస్మరణ దినొత్సవాలు జరగనుండగా ఈ రోజు సీ ఎం జగన్, హోం మంత్రి సుచరిత పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో
పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు ఏపీ సీఎం జగన్‌.అనంతరం సీఎం జగన్‌ గౌరవ వందనం స్వీకరించారు. పోలీసు అమరవీరులను గుర్తు చేసుకున్నారు. ఇక దేశాభివృద్ధికి తలసరి ఆదాయం కంటే శాంతి భద్రతలే ముఖ్యమన్నారు జగన్‌. నేరాలను తగ్గింపు ,మహిళల భద్రత కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తప్పు చేసింది ఎవరైనా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దని పోలీసులకు సూచించారు సీఎం జగన్‌. దిశ చట్టానికి త్వరలోనే ఆమోదం వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.