అచ్చెన్న పై అంబటి సెటైరికల్ ట్వీట్!

వాస్తవం ప్రతినిధి: టీడీపీకి నూతన జవసత్వాలు కలిగించే దిశగా అధినేత చంద్రబాబునాయుడు విస్తృతస్థాయిలో మార్పులు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు స్థానంలో అచ్చెన్నాయుడికి బాధ్యతలు అప్పగించారు. అచ్చెన్నాయుడు కూడా తన నియామకం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆయన కుటుంబంలోనూ హర్షం వెల్లివిరుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యంగ్యం ప్రదర్శించారు. “అసలే మునిగిపోతున్న పడవ… అచ్చెన్నాయుడు వంటి ‘పెద్ద’ మనిషిని ఎక్కించారు… ఇక దరిచేరదీనావ!” అంటూ ఎద్దేవా చేశారు.