బిజెపి నుంచి ఒకరు సస్పెండ్..!!

వాస్తవం ప్రతినిధి: బిజెపి పార్టీ కి సోము వీర్రాజు అధ్యక్షుడిగా అయిన తర్వాత..పార్టీలో కోవర్టుల సంగతి పని పడుతూ సస్పెన్షన్ నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. సోము అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీ లోకి వచ్చిన వారి కంటే సస్పెండ్ అయిన వారి సంఖ్య ఎక్కువ అనే టాక్ కూడా ఉంది. ఇదిలా ఉండగా టిడిపి పార్టీ నుంచి బిజెపి లోకి వెళ్లిన లంక దినకర్ అనే నేతను బిజెపి సస్పెండ్ చేసింది. పార్టీ ఆదేశాలను ధిక్కరించినందుకు గాను ఆయనను సస్పెండ్ చేసినట్లు బిజెపి అద్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. బిజెపిలో తెలుగుదేశం కోసం ఈయన పనిచేస్తున్నారన్న అనుమానాలు బిజెపికి వచ్చాయని, అంతేకాక టివీ చర్చలలో పాల్గొంటూ సొంత అబిప్రాయాలు చెబుతున్నారని పార్టీకి ఫిర్యాదులు వెళ్లాయి. గతంలో జారీచేసిన షోకాజ్‌ నోటీసుకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా, మళ్లీ టీవీ చర్చల్లో పాల్గొన్నాంటున్నారని ఆయనను అందుకే పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడం జరిగింది అని క్లారిటీ ఇచ్చారు.