బెల్జియం లో కరోనా సెకండ్‌వేవ్.. అధికారులు అలర్ట్..!!

వాస్తవం ప్రతినిధి : కరోనా వైరస్‌ మహమ్మారి ధాటికి బెల్జియం విలవిలలాడుతుంది. ఇప్పుడు అక్కడ సెకండ్‌వేవ్‌ ప్రారంభమయ్యిందట! ఇప్పటికే బ్రిటన్‌ కోవిడ్‌-19 నిబంధనలను చాలా కఠినంగా అమలుచేస్తున్నది. కరోనా కేసులు సునామీలా వెల్లువెత్తే ప్రమాదం ఉందని అక్కడి అధికారులు హెచ్చరించారు.. ముందుజాగ్రత్తగా బార్లు, రెస్టారెంట్లు నెల రోజుల పాటు మూసేసింది బెల్జియం ప్రభుత్వం.. అలాగే రాత్రిళ్లు కర్ఫ్యూ విధించింది. గత కొన్ని రోజులుగా బెల్జియంలో కరోనా కేసులు ఎక్కువయ్యాయి.. హాస్పిటల్స్‌లో కేవలం ఎమర్జెన్సీ కేసులను మాత్రమే టేకప్‌ చేస్తున్నారు. రోజుకు అక్కడ కనీసం ఎనిమిది వేల కేసులు నమోదవుతున్నాయి.. వారం రోజుల్లో కేసుల సంఖ్య 79 శాతం పెరగడం చూస్తుంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. మనం కరోనా సునామీకి చాలా దగ్గరలో ఉన్నామని బెల్జియం ఆరోగ్యశాఖ మంత్రి ఫ్రాంక్‌ వాండెన్‌ బ్రౌకే ప్రకటించడంతో ప్రజలు కూడా అప్రమత్తమయ్యారు.