అక్కడ మళ్ళీ కాలు మోపిన టిక్‌టాక్‌ .. బ్యాన్ ఎత్తివేత..!!

వాస్తవం ప్రతినిధి : అనైతిక, అసభ్యకరమైన సందేశాలకు వేదికగా మారిన టిక్‌టాక్‌ వీడియో షేరింగ్‌ యాప్‌ను పాకిస్తాన్‌ ఇటీవల బ్యాన్‌ చేసిన తెలిసిందే. చట్టపరమైన చర్యలను చేపట్టడంలో టిక్‌టాక్‌ యాజమాన్యం విఫలమైందని, అసభ్యతతో కూడి కంటెంట్‌ ఎక్కువగా ఉంటోందని పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ (పీటీఏ) ఫిర్యాదు మేరకు అక్టోబర్‌ 9న నిషేధం విధించి చైనాకు ఊహించని షాక్‌ ఇచ్చింది.

అయితేపాకిస్తాన్ లో టిక్ టాక్ మళ్ళీ ‘కాలు మోపింది’. 10 రోజుల క్రితం ఈ చైనీస్ యాప్ ఫై పాక్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ఆ దేశ సమాచార మంత్రిత్వశాఖ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే పాకిస్తాన్‌ మిత్రదేశం చైనా ఒత్తిడి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. టిక్‌టాక్‌ను నిషేధించడం పాక్‌ ప్రభుత్వానికి తొలినుంచీ అండగా నిలుస్తున్న డ్రాగన్‌కు ఏమాత్రం మింగుడుపడటంలేదని, యాప్‌ను తిరిగి పునరుద్ధరించాలని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై ఒత్తిడి తెచ్చినట్లు అభిప్రాయపడుతున్నారు.. ఈ యాప్ పై బ్యాన్ ను కొనసాగించిన పక్షంలో బీజింగ్ తో పాక్ సంబంధాలు దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అందువల్ల ఈ యాప్ మీద బ్యాన్ తొలగించారు.