తెలుగు భాషకు అమెరికా అరుదైన గుర్తింపు..!!

వాస్తవం ప్రతినిధి : తెలుగు భాషకు అమెరికా పట్టంకట్టింది. అమెరికాలో కమ్యూనికేషన్ కోసం తెలుగు భాషను అధికారిక భాషగా గుర్తిస్తూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నవంబర్ 3న అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాలో ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రపంచ భాషల్లో బ్యాలెట్ పత్రాలను ముద్రిస్తారు. ఇప్పటి వరకు కొన్ని ఇండియన్ భాషలు మాత్రమే ఈ జాబితాలో ఉండేవి. ప్రస్తుతం వాటి సరసన తెలుగు కూడా చేరింది. దీంతో తెలుగులో కూడా బ్యాలెట్ పేపర్ల ముద్రణ జరగనుంది. కాగా.. అమెరికాలో తెలుగు భాషకు దక్కిన గౌరవంపట్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.