‘రామరాజు ఫర్ భీమ్’ ముహూర్తం ఖరారు!

వాస్తవం సినిమా: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీలో రామ్ చరణ్ ‘అల్లూరి సీతారామరాజు’గా.. ఎన్టీఆర్ ‘కొమరం భీమ్’గా కనిపించనున్నారు. నందమూరి తారకరాముడు నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ నుంచి ఎన్టీఆర్ కి సంబంధించిన స్పెషల్ వీడియో ఈ నెల 22న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.

‘రామరాజు ఫర్ భీమ్’ పేరుతో రానున్న ఈ టీజర్ ముహూర్తం ఖరారు చేసింది చిత్ర యూనిట్. అక్టోబర్ 22న ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో ‘రామరాజు ఫర్ భీమ్’ రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడిస్తూ ‘ఆర్.ఆర్.ఆర్’ టీమ్ వెల్లడించింది.

ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తుండగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కతున్న ఈ మూవీలో అజయ్ దేవగన్ – శ్రియా శరణ్ – సముద్రఖని – అలియా భట్ మరియు ఐరిష్ బ్యూటీ ఒలివియా – అలిసన్ డూడీ – రే స్టీవెన్సన్ ఇతర ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. కరోనా కారణంగా గత ఏడున్నర నెలలుగా నిలిచిపోయిన ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమై శరవేగంగా జరుపుకుంటోంది.