నేడు దుర్గమ్మకు అన్నపూర్ణాదేవి అలంకారం!

వాస్తవం ప్రతినిధి: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకోరూపంలో భక్తులకు అభయమిస్తున్నారు. కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకొని భారీగా తరలివస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. భక్తులను పరిశీలించిన తర్వాతే ఆలయం లోపలికి అనుమతిస్తున్నారు సిబ్బంది. క్యూలైన్లలో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఉత్సవాల్లో నాలుగో రోజైన మంగళవారం అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిన్న అమ్మవారిని 10,899 మంది భక్తులు దర్శించుకున్నారని అధికారులు తెలిపారు.