కాంగ్రెస్ నాయకులను పరుగులు పెట్టిస్తున్న దుబ్బాక ఉపఎన్నికలు..!

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే దుబ్బాక ఉప ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని టీకాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటిదాకా జరిగిన రెండు ఉప ఎన్నికలలో కాంగ్రెసు ఓడిపోవడంతో జరగబోయే ఉప ఎన్నికలలో గెలిచి పార్టీ పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది.

ఈ నేథ్యంలో తెలంగాణ ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్య టాగూర్ ఎందుకోసం ఎప్పుడు సరికొత్త ప్లాన్ వేశారు. పూర్తి విషయంలోకి వెళితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నా… తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులను నియోజకవర్గంలో రంగంలోకి దింపి ఒక్కొక్కరికి ఒక్కో మండలాన్ని అప్పగించారట.

ఈ క్రమంలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రెడ్డి వీరందరికీ ఒకో మండలాన్ని ఇన్చార్జి మాణిక్య ఠాగూర్ అప్పగించారట. దీంతో వీరంతా ఇప్పుడు నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడేలా ఎవరికి వారు ప్రత్యేకమైన టీంలను మండలాల్లో దింపి… తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నట్లు సమాచారం.