అనవసరంగా వైసీపీ లోకి వచ్చాను అని తెగ బాధపడుతున్న నేత…??

వాస్తవం ప్రతినిధి: కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం లో కీలక నేతగా ఎదిగిన రామసుబ్బారెడ్డి గతంలో టీడీపీలో ఓ వెలుగు వెలిగారు. తన ప్రత్యర్థి ఆదినారాయణ రెడ్డి పై రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన రామసుబ్బారెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి పార్టీ తరపున ఎమ్మెల్యేగా బరిలోకి దిగి వైసీపీ కాండేట్ సుధీర్ రెడ్డి అనే కొత్త నేత పై కూడా ఓడిపోవడం జరిగింది

అయితే టిడిపి చాలా వరకు పట్టు కోల్పోయే విధంగా 2019 ఎన్నికలలో ఓటమి చెందడంతో… రామ సుబ్బారెడ్డి జగన్ సమక్షంలో వైసీపీలో చేరడం జరిగింది. అయితే వైసీపీలో జాయిన్ అయినా గాని నియోజకవర్గంలో కొత్త ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ్యవహారం రామసుబ్బారెడ్డికి పెద్ద తలనొప్పిగా మారినట్లు వార్తలు వస్తున్నాయి. అసలు మర్యాద ఇవ్వకుండా తన అనుచరులను సైతం… పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచేలా సుధీర్ రెడ్డి వ్యవహార శైలి ఉన్నట్లు…రామసుబ్బారెడ్డి అనవసరంగా వైసీపీలోకి జాయిన్ అయి తప్పు చేసినట్లు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.