టిడిపిని ఇబ్బంది పెడుతున్న కొత్త ముఖాలు..??

వాస్తవం ప్రతినిధి: ఇటీవల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించి కొత్త కమిటీ ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీ ఇన్చార్జి ల పరంగా చంద్రబాబు ప్రకటించిన కొత్త కమిటీ లో చాలా వరకు కొత్తవారికి అవకాశం ఇచ్చేలా నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ఇదిలా ఉండగా కొత్తగా పార్టీ అధ్యక్ష పదవికి సెలెక్ట్ అయిన జూనియర్ల వారి విషయంలో టిడిపి పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా… నెగిటివ్ గా స్పందిస్తూ ఉన్నట్లు టాక్ వస్తుంది. ఏమాత్రం సీనియర్ లను పట్టించుకోకుండా టిడిపి లో ఉండే ముఖ్య నాయకులకు మాత్రమే…టిడిపి పార్టీ అనుకూలంగా ఉండే మీడియా ప్రాధాన్యత ఇస్తున్నట్లు పార్టీలో టాక్ నడుస్తోంది. కొత్తగా అధ్యక్ష పదవిని చేపట్టిన జూనియర్లకు మీడియా కవరింగ్ అసలు లేదని వాపోతున్నారట. ఇలా అయితే రాబోయే రోజుల్లో కష్టమని… ప్రజలకి తాము ఏమిటో తామే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని ధిక్కార స్వరం వినిపిస్తున్నారట. మరోపక్క కొంతమంది సోషల్ మీడియాని నమ్ముకుని తమకి తాము ప్రచారం చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లు టాక్ వస్తుంది.