వియ‌త్నాం దేశంపై ప్ర‌కృతి ప‌గ.. 90 మంది మృతి..!!

వాస్తవం ప్రతినిధి : వియ‌త్నాం దేశంపై ప్ర‌కృతి ప‌గ ప‌ట్టేసింది. ప్ర‌కృతి ప్ర‌కోపానికి ఈ దేశం గ‌జ‌గ‌జ వ‌ణుకుతోంది. గ‌త రెండు వారాలుగా ఇక్క‌డ భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఓ వైపు భారీ వ‌ర్షాలు.. మ‌రోవైపు కొండ చ‌రియ‌లు విరిగి ప‌డ‌డంతో ఇప్ప‌టికే 90 మంది మృతి చెందారు. మ‌రో 34 మంది గల్లంతు అయిన‌ట్టు అధికారులు తెలిపారు. క్వాంగ్ ట్రై, తువా థియన్ హ్యూ, క్వాంగ్ నామ్ ప్రావిన్స్‌లలో అధిక ప్రాణనష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ ఉదయం వరకు ఈ మూడు ప్రావిన్స్‌లోని 37,500 ఇండ్లలోని 1,21,280 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు.