న్యూజిలాండ్ ఎన్నికల్లో ఎన్నారై గెలుపు..!!

వాస్తవం ప్రతినిధి : న్యూజిలాండ్ ఎన్నికల్లో భారతీయుడు సత్తా చాటాడు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌ జిల్లాకు చెందిన గౌరవ్ శర్మ.. 20 సంవత్సరాల క్రితం న్యూజిలాండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వైద్య విద్యను పూర్తి చేసి, డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా.. ఈ నెల 17న జరిగిన సాధారణ ఎన్నికల్లో గౌరవ్ శర్మ.. లేబర్ పార్టీ తరఫున పోటీ చేశారు. హమిల్టన్ వెస్ట్ ఎలక్టోరేట్ నుంచి ఎంపీగా గెలుపొందారు. నేషనల్ పార్టీకి చెందిన అభ్యర్థిపై గౌరవ్ శర్మ.. 4,425 ఓట్ల మెజార్టీతో గెలుపొందారని న్యూజిలాండ్ ఎలక్టోరల్ కమిషన్ వెల్లడించింది.