కంగనా రనౌత్ పై దేశద్రోహం కేసు..!!

వాస్తవం సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సూసైడ్ కేసు విషయంలో స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ బాలీవుడ్ ఇండస్ట్రీ పై షాకింగ్ కామెంట్ లు చేసి షేక్ చేసి పారేసింది. ఒక్క బాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాక కొంత మంది పొలిటిషన్ లపై కూడా ఈ విషయంలో కంగనా కడిగిపారేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో మహారాష్ట్రలో అడుగు పెట్టకూడదు అని అక్కడ అధికార పార్టీ శివసేన చేసిన కామెంట్లకు దీటుగా కూడా కంగనా కౌంటర్లు ఇవ్వటం జరిగింది.

పరిస్థితి ఇలా ఉండగా కంగనారనౌత్ పై తాజాగా దేశ ద్రోహం కేసు నమోదు అయింది. పూర్తి విషయంలోకి వెళ్తే సుశాంత్ కేసులో ముంబై పోలీసులు శివసేన సర్కార్ ఫెయిల్ అయిందని కంగనారనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టింది.

ఈ తరుణంలో ముంబై ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా అభివర్ణించింది. దీంతో కంగనారనౌత్ పెట్టిన పోస్ట్ పై ఒక నెటిజన్ ముంబై కోర్టును ఆశ్రయించారు. ఆ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కోర్టు కంగనా పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కంగనా రనౌత్ పై మాత్రమే కాకుండా ఆమె సోదరి రంగోలి పై కూడా కేసు నమోదు చేయాలని ముంబై పోలీసులకు ఆదేశాలు ఇవ్వడంతో ముంబై పోలీసులు… కంగనా రనౌత్ ఆమె సోదరి పై దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. ముంబైలోని బాంద్రా మెజిస్ట్రేట్ మెట్రోపోలిటన్ కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు పేర్కొన్నారు.