చిరంజీవి లేకుండానే షూటింగ్..??

వాస్తవం సినిమా: మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్ కూడా దాదాపు నలభై నిమిషాల పాటు సినిమాలో ఉండే క్యారెక్టర్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేస్తుంది. ఓ స్పెషల్ సాంగ్ లో రెజీనా నటిస్తోంది.

ఇదిలా ఉండగా కరోనా కారణంగా సినిమా షూటింగ్ మొన్నటి వరకు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అసలు సినిమాకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న డైలమాలో ఉన్న మెగా అభిమానులకు ఈ వార్త తెలియడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ జోష్ లో ఉన్నారు.

కాగా మొదలైన సినిమా షూటింగ్ లో చిరంజీవి పాల్గొనటం లేదట. చిరంజీవి లేని సన్నివేశాలను మాత్రమే ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారట. చిరంజీవి పాల్గొనటానికి ఇంకా టైం పెట్టే అవకాశం ఉన్నట్లు, ఆ లోపు మిగతా బ్యాలెన్స్ సన్నివేశాలను కంప్లీట్ చేయాలని కొరటాల తాజాగా ప్లాన్ చేసుకున్నారట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది.