వరదలపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ సమీక్ష

వాస్తవం ప్రతినిధి: ఏపీలో కురుస్తున్నభారీ వర్షాల కారణంగా ఎగువ రాష్ట్రాల నుంచి వరద వస్తూ ఉండటంతో అధికారులను అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ తెలిపారు. మంత్రి అనిల్‌ కుమార్‌ సోమవారం వరదలపై సమీక్ష నిర్వహించారు. “వివిధ ప్రాజెక్టుల్లో సమస్యలు, చెరువులకు గండ్లు, కృష్ణ-గుంటూరు జిల్లాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన పలు సూచనలు చేశారు. ఈ సమాశానికి నీటి పారుదల శాఖ ప్రధాన‌ ఇంజనీర్‌, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.