టీడీపీ పార్టీ కొత్త కమిటీలు ప్రకటించిన చంద్రబాబు..!!

వాస్తవం ప్రతినిధి: టిడిపి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా పార్టీకి సంబంధించిన కొత్త కమిటీలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర టిడిపి అధ్యక్షుడిగా కింజరాపు అచ్చెన్నాయుడు ను ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎల్.రమణ ని నియమించారు. 27 మంది సభ్యులతో కేంద్ర కమిటీని అదేవిధంగా 25 మంది సభ్యులతో పోలిట్ బ్యూరో ను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 31 మందితో తెలంగాణ రాష్ట్ర టిడిపి కమిటీని కూడా చంద్రబాబు నాయుడు ఇదే సందర్భంలో ప్రకటించారు. ప్రకటించిన లిస్ట్ ప్రకారం చూస్తే కేంద్ర కమిటీ లో గల్లా అరుణకుమారి, ప్రతిభా భారతి, సత్యప్రభా తో పాటుగా కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే నాగేశ్వరరావు, కాశీనాథ్ ఉపాధ్యక్షులుగా వ్యవహరించనున్నారు. పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి గా నారా లోకేష్, వర్ల రామయ్య, రామ్మోహన్ నాయుడు, నిమ్మల రామానాయుడు, రవిచంద్ర యాదవుల తో పాటుగా కొత్తకోట దయాకర్ రెడ్డి, బక్కని నర్సింహులు, రామ్మోహన్ రావు నియమితులయ్యారు. అదే తరహాలో నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ నీ పోలిట్బ్యూరో లోకి తీసుకోగా…. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, కళా వెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బోండా ఉమా, ఫరూక్, గల్లా జయదేవ్, శ్రీనివాస రెడ్డి, కొల్లు రవీంద్ర, సత్యనారాయణ, గుమ్మడి సంధ్యారాణి తదితరులు పోలిట్బ్యూరో సభ్యులు గా ప్రకటించారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలక్రిష్ణ పోలిట్బ్యూరో లో అడుగుపెట్టడంతో నందమూరి అభిమానులు తో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఫుల్ సంబరాలు చేసుకుంటున్నారు.