బీసీలను అణగ తొక్కింది చంద్రబాబే :విజయసాయిరెడ్డి

వాస్తవం ప్రతినిధి: ఏపీలో బీసీలకు కార్పొరేషన్లు వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో రాజకీయం మొత్తం బీసీ వర్గాల చుట్టూ తిరుగుతోంది. టిడిపి పార్టీ నేతలు కీలకమైన పదవులను జగన్ తన సొంత సామాజికవర్గ నేతలకు కేటాయించి మిగతావి ఆయా వర్గాలకు కేటాయిస్తున్నట్లు తప్పుబట్టారు. ఇటువంటి క్రమంలో వైసిపి సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు పై ఘాటు విమర్శలు చేశారు. బీసీ వర్గాలకు సంబంధించి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. బీసీ లు అంటే బ్యాక్ బోన్ వర్గాలు అని సీఎం జగన్ మోహన్ రెడ్డి మొదటి నుండి చెబుతున్నారు అని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. బీసీ ల ఆత్మ గౌరవం ను పెంపొందించేలా 56 కార్పొరేషన్ లకు ఛైర్ పర్సన్లు, సభ్యులను నియమిస్తే పచ్చ పార్టీ గంగ వెర్రులెట్టుతోంది అని విజయసాయి రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. బీసీ లను ఎదగకుండా చేసిన ఘనత బాబు గారిది అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు.