బీసీలకు జగన్ వెన్నుపోటు పొడిచారు : అయ్యన్నపాత్రుడు

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల 139 బిసి కులాలకు గాను 56 బీసీ కార్పొరేషన్ లు వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి కార్పొరేషన్ల చైర్మన్ డైరెక్టర్లు పేర్లను జగన్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో 50 శాతం రిజర్వేషన్లు మహిళలకు కల్పించింది. ఈ నేపథ్యంలో దీనిపై టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్పందించారు. రాష్ట్రంలో అత్యున్నత పదవులు కోసం ఎనిమిది వందల మంది సొంత సామాజిక వర్గం వారికి జగన్ ఇచ్చుకున్నారు అని అన్నారు. అయితే బీసీ కార్పొరేషన్ల విషయంలో సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకునే అవకాశం లేక బీసీ కులాల వారిని నియమించి అదేదో బీసీలకు మేలు చేసినట్టు వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని దానికి సాక్షి పేపర్ డబ్బా కొట్టే రీతిలో ప్రకటనలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంలో కీలకమైన పదవులు మీ సొంత సామాజిక వర్గానికి, బీసీ కార్పొరేషన్ నిధులన్నీ మింగేసి… ఇప్పుడు బీసీ కార్పొరేషన్ ల పోస్టులు వెనుకబడిన తరగతుల వారికి ఇచ్చి బీసీలనీ జగన్ సర్కార్ వెన్నుపోటు పొడిచిందని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు.