భారతీయులకు నవరాత్రి శుభాకాంక్షలు : జో బైడెన్, కమలా హ్యారిస్

వాస్తవం ప్రతినిధి : డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్, ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ భారతీయులకు నవరాత్రి శుభాకాంక్షలను తెలియజేశారు.

‘హిందువుల పండుగైన నవరాత్రి మొదలైంది. ఈ సందర్భంగా అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా వేడుకలు చేసుకుంటున్న వారందరికి జిల్, నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈసారి కూడా చెడుపై మంచి విజయం సాధించి కొత్త ఆనందాలు, అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాము’ అని జో బైడెన్ ట్వీట్ చేశారు.

మరోపక్క కమలా హ్యారిస్ ఆమె ట్వీట్‌లో ‘హిందూ అమెరికన్ కుటుంబాలు, స్నేహితులకు నవరాత్రి శుభాకాంక్షలు. అన్ని వర్గాల వారూ కలిసి ఐకమత్యంతో సమున్నతమైన అమెరికాను నిర్మించడానికి ఈ పండుగ ప్రేరణ అవుతుందని ఆశిస్తున్నాను’ అని రాసుకొచ్చారు.