‘ఖిలాడి’ ఫస్ట్ లుక్ రిలీజ్

వాస్తవం సినిమా: మాస్ మహారాజ్ రవితేజ ఇటీవల తనపై వచ్చిన అన్ని విమర్శలకు ప్రాక్టికల్ గానే చెక్ పెట్టేస్తున్నాడు. ఇదిగో ఈ గెటప్పే అందుకు ప్రూఫ్. చూస్తుంటే ఇప్పుడే కాలేజ్ కి వెళుతున్న టీనేజీ కుర్రాడిలా కనిపిస్తున్నాడంటూ రవితేజ ఫాన్స్ అంతా నెట్టింట్లో హల్చల్ చేస్తున్నారు.
రవితేజ 67వ సినిమాకు సంబంధించి టైటిల్ తో పాటు, ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘ఖిలాడి’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. రమేశ్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. జయంతిలాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్, పెన్ మూవీస్ పతాకాలపై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయాన్ని కాసేపట్లో ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తుండగా… డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ‘మరో అద్భుత ప్రయాణానికి సర్వం సిద్ధం’ అని రవితేజ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు.