వాస్తవం ప్రతినిధి: ఏపీ సీఎం జగన్ న్యాయమూర్తులపై చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానాలు, జడ్జిలపై సీఎం జగన్ భారత ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ జనాల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతోనే బయటకు వదిలారన్నారు.ఈ అంశంలో కేంద్రం కట్టడి చేయాలనుకుంటే చేయవచ్చని, గతంలో ఎన్టీఆర్ ప్రజా సేవ చేయాలనుకుంటే కోర్టులు అడ్డుపడుతున్నట్లు భావించాడన్నారు. కోర్టులు అడ్డుపడుతున్నాయనుకున్న ఎన్టీఆరే ఆ తర్వాత కోర్టు తీర్పులకు లోబడి ప్రజా సేవ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. న్యాయ వ్యవస్థపై ఇప్పుడు జరుగుతున్న చర్చ హుందాగా జరగాలని, ప్రభుత్వం-న్యాయ వ్యవస్థ వద్ద ఘర్షణలు ప్రజలకు మేలు చేయవన్నారు. అయితే, ఇలా లేఖలు రాయటం మాత్రం కొత్త కాదని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.