పెను ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డ కేంద్రమంత్రి

వాస్తవం ప్రతినిధి: పెను ప్రమాదం నుంచి కేంద్ర మంత్రి రవిశంకర్ తృటిలో తప్పించుకొన్నారు.ఆయన ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్ ప్రమాదానికి గురైంది.అయితే ఈ ప్రమాదం నుంచి కేంద్ర మంత్రి రవిశంకర్ క్షేమంగా బయటపడ్డారు. వివరాల ప్రకారం..

బీహార్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి రవిశంకర్ పాల్గొంటున్నారు. ఆ రాష్ట్రంలోని వివిధ సభల్లో బీహార్ మంత్రులు మంగళ్ పాండే సంజయ్ ఝాలతో కలిసి హెలిక్యాప్టర్ లో పర్యటిస్తూ మాట్లాడుతున్నారు.

ఈ క్రమంలోనే కేంద్రమంత్రి రవిశంకర్ ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్ బీహార్ రాజధాని పాట్నా విమానాశ్రయంలో ప్రమాదానికి గురైంది. కరెంట్ తీగలకు తగలడం వల్ల హెలిక్యాప్టర్ రెక్కలు విరిగిపోయాయి.

అయితే ఈ ప్రమాదం నుంచి కేంద్ర మంత్రి రవిశంకర్ క్షేమంగా బయటపడ్డారు. ఆయనతోపాటు హెలిక్యాప్టర్ లో మంత్రులు మంగళ్ పాండే సంజయ్ ఝాలు కూడా ఉన్నారు. ఎన్నికల ప్రచారం ముగించుకొని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లకుండా పైలెట్ సమయస్ఫూర్తిగా కిందకు దించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.