సాగర్ 18 క్రస్ట్ గేట్ల ఎత్తివేత!

వాస్తవం ప్రతినిధి: నల్గొండ జిల్లాలో ఉన్న చారిత్రక నాగార్జున సాగర్ డ్యామ్‌కు వరద ఉధృతి కొనసాగుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా సాగర్ లోకి వరదనీరుపోటెత్తుతోంది. దీంతో శనివారం ఉదయం 18 క్రస్ట్ గేట్స్ 15 ఫీట్ల మేర ఎత్తి 3,86,544 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.