ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..ఏడుగురు దుర్మరణం

వాస్తవం ప్రతినిధి: ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పిలిబిత్‌, ఖుషీనగర్‌ జిల్లాలను కలిపే జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 32 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప జిల్లా ఆసుపత్రికి తరలించారు. శనివారం తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పిలిభిత్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ జై ప్రకాష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మంది, బొలెరోలో 10 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాద సమయంలో బొలెరో డ్రైవర్‌ నిద్రమత్తులో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.