కొత్త రకం చేపను కనుగొన్న తేజస్ థాకరే!

వాస్తవం ప్రతినిధి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కుమారుడు తేజస్ థాకరే మరికొందరితో కలిసి అత్యంత అరుదైన స్కిస్తురా జాతికి చెందిన కొత్త రకం చేపను కనుగొన్నారు. ‘దీనికి స్కిస్తురా హిరణ్యాక్షి’ అని పేరు పెట్టారు.

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే కుమారుడు తేజస్ థాక్రే ఐసీఏఆర్ ఇన్ స్టిట్యూట్ పోర్టుబ్లెయర్కు చెందిన జయసింహన్ ప్రవీణ్ రాజ్ అండన్ వాటర్ ఫోటోగ్రాఫర్ శంకర్ బాలసుబ్రహ్మణ్యన్ కలిసి పశ్చిమ కనుమలలో దీనిని కనుగొన్నారు. దీనికి ‘స్కిస్తురా హిరణ్యాక్షి’ అని నామకరణం చేశారు. ఇది హిరణ్యాక్షి అనే నదిలో లభించడం వల్ల దీనికి ఈ పేరు పెట్టారు.

దీనికి సంబంధించిన వివరాలను వారు ఆక్వా ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇక్తాలజీలో ప్రచురించారు.హిరణ్యాక్షి అంటే బంగారపు రంగు జుట్టు కలది అనే అర్థం కూడా వస్తుండటంతో ఈ పేరు చేపను వర్ణించడానికి కూడా సరిపోతుంది. ఇక ఈ చేపను తేజస్థాక్రే 2012లోనే కనుగొన్నారని ప్రవీణ్ రాజ్ చెప్పారు. దాని తరువాత 2017 లో ఈ జాతికి సంబంధించిన మరిన్ని చేపలను కనుగొన్నట్లు ప్రవీణ్ తెలిపారు. దీంతో దీని మీద మరింత రీసెర్చ్ చేసి దీనికి సంబంధించిన వివరాలను జర్నల్ లో వెల్లడించారు.