అమెరికా రాజకీయ చరిత్రలోనే ఇదే తొలిసారి .. ఇక ట్రంప్ కు కష్టమే..!!

వాస్తవం ప్రతినిధి : నవంబర్ 3న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం ఆయా పార్టీ నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. ప్రచారంలో భాగంగా ట్రంప్ కంటే ఆయన ప్రత్యర్ధి జో బిడెన్ ముందజలో ఉన్నారు.డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షడు జో బైడెన్, ఉపాధ్యక్ష అభ్యర్థి, ఇండో-అమెరికన్ సెనేటర్ కమలా హ్యారిస్ తరఫున అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. వచ్చేవారం పెన్సిల్వేనియాలో జరిగే ఎన్నికల ర్యాలీలో ఒబామా పాల్గొని ప్రసంగిస్తారని బైడెన్ క్యాంపెయిన్ శుక్రవారం వెల్లడించింది.

అయితే, ఒక మాజీ ఉపాధ్యక్షుడు ఇలా నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం అమెరికా రాజకీయ చరిత్రలోనే ఇదే తొలిసారి. ఇంతకుముందు మాజీలు ఆన్‌లైన్ వేదికలపై సొంత పార్టీలకు మద్దతు తెలపడం, ప్రచారం నిర్వహించడం జరిగింది. కానీ, ఇలా నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. ఇక ఒబామా అధ్యక్ష పదవి కాలం ముగిసి నాలుగేళ్లు గడిచిన తన వక్తృత్వ నైపుణ్యాల కారణంగా ఇప్పటికీ ప్రతిపక్ష డెమొక్రాటిక్ పార్టీకి అతిపెద్ద క్రౌడ్ పుల్లర్‌ ఆయనే కావడం గమనార్హం.