మరోసారి భారత్‌పై నోరు పారేసుకున్న ట్రంప్ ..!

వాస్తవం ప్రతినిధి : భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. పర్యావరణ కాలుష్యానికి ఇండియానే కారణమని నిందించారు. నార్త్ కరోలినా‌లో గురువారం రోజు ట్రంప్ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. వాతావరణ కాలుష్యానికి భారత్, చైనా, రష్యా దేశాలే కారణమన్నారు. “మన పర్యావరణ, ఓజోన్‌ ఇతర గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. మరోవైపు ఇండియా, చైనా, రష్యాలు వాయు కాలుష్యాన్ని పెంచుతున్నాయి” అని ఆయన ర్యాలీలో ఆరోపించారు. ఈ మూడు దేశాలు కాలుష్య కారకాలను తీవ్ర స్థాయిలో గాలిలోకి విడుదల చేస్తున్నాయని ఆరోపించారు. దీంతో పర్యావరణం దెబ్బతింటోంది విమర్శించారు. పర్యావరణ పరిరక్షణకు అమెరికా కట్టుబడి ఉందని, అందుకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.