వర్క్ వీసా గడువు ముగిసిన వారికి ఒమన్‌లో నో ఎంట్రీ!

వాస్తవం ప్రతినిధి: వర్క్ వీసాల గడువు ముగిసిన ప్రవాస కార్మికులను ఒమన్‌‌కు తిరిగి వచ్చేందుకు అనుమతించేది లేదని మహమ్మారి కొవిడ్-19పై ఏర్పాటైన సమావేశంలో బ్రిగేడియర్ సాయిద్ అల్ అస్మి అన్నారు. ప్రస్తుతం వీసా జారీ సస్పెండ్ చేయబడిందని, అయినప్పటికీ చెల్లుబాటు అయ్యే రెసిడెన్సీ వీసా ఉన్న కుటుంబానికి మాత్రమే దేశంలో ప్రవేశం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుప్రీం కమిటీ జారీ చేసిన మార్గదర్శకాలకు సహకారం అందించిన పౌరులు, నివాసితులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా, కరోనా నిబంధనల ఉల్లంఘనలకు భారీ జరిమానా విధిస్తున్నా వారిలో మార్పు రావడంలేదన్నారు. అందుకే ఇకపై ఉల్లంఘనలకు పాల్పడేవారి ఫొటోలు, పేర్లను బహిరంగపరచనున్నట్లు ఆయన పేర్కొన్నారు.