భారత వ్యక్తికి 4 నెలల జైలు శిక్ష విధించిన సింగపూర్ న్యాయస్థానం

వాస్తవం ప్రతినిధి: విమానంలో మహిళా అటెండెంట్‌పై వేధింపులకు పాల్పడిన కేసులో దోషిగా తేలిన భారత వ్యక్తికి సింగపూర్ న్యాయస్థానం శుక్రవారం నాలుగు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. జయన్ మాథన్ గోపాల్(40) 2017, నవంబర్ 2న స్కూట్ విమానంలో కొచ్చి నుంచి సింగపూర్ వెళ్లారు. ఆ సమయంలో 22 ఏళ్ల విమాన అటెండెంట్‌పై వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు విజయన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. దీంతో విచారణలో విజయన్ దోషిగా తేలాడు. దీంతో కోర్టు అతనికి 4 నెలల జైలు శిక్ష విధించింది. అయితే, అతను ఈ శిక్షకు వ్యతిరేకంగా అప్పీల్ దాఖలు చేశాడు. కాని న్యాయస్థానంవిజయన్ అప్పీల్‌ను తిరస్కరించింది.